RBI Governor : లోన్ రికవరీ ఏజెంట్ల నిర్వాకం గవర్నర్ ఆగ్రహం
ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు
RBI Governor : ఈ దేశంలో అప్పులు తీసుకున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. రుణాలు ఇచ్చే వారి కంటే వాటిని వసూలు చేసే బాధ్యతల్ని నిర్వహిస్తూ వస్తున్న లోన్ రికవరీ ఏజెంట్లు అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల నుంచి రుణగ్రహీతలకు చుక్కలు చూపిస్తున్నారు ఈ ఏజెంట్లు. వీరి దెబ్బకు గజగజ వణుకుతున్నారు.
చాలా మంది వీరి వేధింపులు, బూతులు , దాడులు తట్టుకోలేక చాలా మంది అప్పులు తీసుకున్న వారు, కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
దీంతో దేశ వ్యాప్తంగా లోన్ రికవరీ ఏజెంట్ల నిర్వాకంపై, సదరు ఫైనాన్స్ సంస్థలపై ఉక్కుపాదం మోపాలని కోరుతూ పెద్ద ఎత్తున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు చేశారు.
దీంతో దీనిపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఆర్బీఐ. ఇదే విషయాన్ని ఆర్బీఐ చీఫ్ శక్తికాంత దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు లోన్ రికవరీ ఏజెంట్ల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అప్పుల వసూళ్లలో అడ్డగోలు వైఖరిని తప్పు పట్టారు. రుణగ్రహీతలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ కాల్స్ చేస్తున్నారని, బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఆర్బీఐ గవర్నర్(RBI Governor).
తమ పరిధిలోని సంస్థలు ఇలాంటి చర్యలను ప్రోత్సహించినా లేదా తమ పరిశీలనకు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఆధునిక బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సదస్సు లో శక్తి కాంత దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోన్ రికవరీ ఏజెంట్ల తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Also Read : రూపే కార్డుతో లాభాలు ఎన్నెన్నో