RBI Digital Rupee : మార్కెట్ లోకి డిజిటల్ రూపాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే
RBI Digital Rupee : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొలువు తీరాక దేశంలో డిజిటల్ మంత్రం ఎక్కువగా వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా డిజిటల్ భారతం చేయాలన్నది తన సంకల్పమని ఇప్పటికే ప్రకటించారు కూడా. ఈ తరుణంలో డిజిటల్ కరెన్సీ, రూపాయిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మరో వైపు ద్రవ్యోల్బణం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డిజిటలైజేషన్ అనేది ఒక్కటే దేశానికి పరిష్కారం కాదన్న సంగతి ముందుగా ప్రధానమంత్రి గుర్తిస్తే మంచిదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా డిజిటల్ రూపాయిని(RBI Digital Rupee) మార్కెట్ లోకి తీసుకు చచ్చింది.
డిజిటల్ మనీ లేదా క్రిప్టో కరెన్సీని లావాదేవీల కోసం పర్మిషన్ గనుక ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలో పడుతుందని ఇప్పటికే హెచ్చరిస్తూ వచ్చారు నిపుణులు. బ్లాక్ మనీ చేతులు మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తించింది. పెద్ద ఎత్తున జరిగే లావాదేవీలపై ఫోకస్ పెట్టడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పై కేంద్ర ప్రభుత్వం పన్నును విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది ఆర్బీఐ. మొదటి విడతగా తొమ్మిది బ్యాంకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
వీటిలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూబీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ , హెచ్ఎస్బీసీ బ్యాంకులకు లైన్ క్లియర్ ఇచ్చింది.
Also Read : భారీ వర్షం తమిళనాడు అతలాకుతలం