RBI Monetary Policy : ద్రవ్యోల్బణం ముప్పు వడ్డీ రేట్ల పెంపు
ప్రకటించనున్న ద్రవ్య విధాన కమిటీ
RBI Monetary Policy : భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందా. రూపాయి రోజు రోజుకు పతనం చెందుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ(RBI Monetary Policy) కీలక సమావేశం జరిగింది.
ఈ మేరకు మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రభావం కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడనుంది.
కొనుగోలు శక్తి నశించడం అంటే దేశం ప్రమాదంలో ఉందని అర్థం. ఆర్థిక రంగం పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా కొంత మందగనం సాగినా ఆ తర్వాత పుంజుకున్నా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా కదలడం లేదు. ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఓ వైపు నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా ప్రతిదీ పెరుగుతూ పోతోంది.
ద్రవ్యోల్బణం అదుపులోకి రావాలంటే వడ్డీ రేట్లు పెంచని పరిస్థితి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 ప్రారంభం నుంచి మూడోసారి ముచ్చటగా వడ్డీ రేట్లు పెంచడం.
ఇక జనవరి నుంచి సెంట్రల్ బ్యాంక్ టార్గెట్ ఎగువన ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని భావిస్తున్నారు గవర్నర్. ఇదిలా ఉండగా సెంట్రల్ బ్యాంక్ తన అనుకూల ద్రవ్య విధాన వైఖరిని క్రమంగా ఉప సంహరించు కోవాలని ఇప్పటికే ప్రకటించింది.
ఇక శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
Also Read : 5జీ సేవలకు ఎయిర్ టెల్ రెడీ