RBI : రుణ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ షాక్
వేధింపులకు గురి చేస్తే జాగ్రత్త
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రుణ గ్రహీతలకు చుక్కలు చూపిస్తూ నిత్యం వేధింపులకు గురి చేస్తూ వస్తున్న రుణ రికవరీ ఏంజెట్లకు వార్నింగ్ ఇచ్చింది.
అనైతిక విధానాలకు పాల్పడడం, దూషించడం, ఆపై బెదిరింపులకు దిగడంతో వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా విమర్శలు చోటు చేసుకున్నాయి.
24 గంటల పాటు ఫోన్లు చేయడం, వేధించడం, బౌన్సలర్లతో దాడులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని హెచ్చరించింది ఆర్బీఐ(RBI) . శనివారం ఈ మేరకు రుణాలు ఇచ్చే బ్యాంకర్లు, లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలు, ఏజెంట్లకు కఠినమైన రూల్స్ ఏర్పాటు చేసింది.
రుణ గ్రహీతలను బెదిరించడం పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు (ఆర్ఈలు), ఏఆర్సీలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు మార్గదర్శకాలు జారీ విడుదల చేసింది. రుణ గ్రహీతలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం లేదా సమాచారాన్ని మాత్రమే అందివ్వాలని సూచించింది.
ఏ మాత్రం వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందినా ఆయా సంస్థలను పూర్తిగా బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. ఏ రూపంలో కూడా అనుచిత సందేశాలు పంప కూడదని స్పష్టం చేసింది. వేధించవద్దని సూచించింది.
దేశ వ్యాప్తంగా రికవరీ ఏజెంట్లు చేస్తున్న ఆగడాలను తట్టుకోలేక పోవడం, ఇబ్బందులకు గురి కావడం గురించి ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : స్టార్టప్ ఎకో సిస్టమ్ లో 3వ ప్లేస్ లో భారత్