RCB Retention List : సీనియ‌ర్ల‌కు ఆర్సీబీ మ‌రోసారి ఛాన్స్

కోహ్లీ..ప‌టేల్..పాటిదార్..దినేష్ కార్తీక్

RCB Retention List : ఐపీఎల్ 2023కి సంబంధించి రిటైన్, రిలీజ్ జాబితా ప్ర‌కారం చూస్తే బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్(RCB Retention List) మాత్రం అన్ని జ‌ట్ల కంటే భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌ధానంగా త‌మ జ‌ట్టుకు ఎన‌లేని సేవ‌లు అందిస్తూ వ‌స్తున్న స్టార్ క్రికెట‌ర్, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీపై న‌మ్మ‌కం ఉంచింది మ‌రోసారి. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఆ జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించాడు.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) తాను త‌ప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించాడు. ఒక ర‌కంగా ఆర్సీబీకి బిగ్ షాక్ . కానీ జ‌ట్టులో తాను కొన‌సాగుతాన‌ని, త‌న శ‌రీరం స‌హ‌క‌రించేంత వ‌ర‌కు జ‌ట్టు కోసం ఆడ‌తాన‌ని వెల్ల‌డించాడు. ఇది ఆ జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక ఇటీవ‌ల ఫామ్ లోకి తిరిగి రావ‌డం కూడా ఆర్సీబీకి ప్ల‌స్ పాయింట్ కానుంది. ఇక ఐపీఎల్ లో జ‌ట్టు ప‌రంగా య‌థావిధిగా డుప్లెసిస్ ను కెప్టెన్ గా ఉంచింది.

అత‌డితో పాటు విరాట్ కోహ్లీ, ప్ర‌భు దేశాయి, ర‌జ‌త్ పాటిదార్ , దినేష్ కార్తీక్ , అనుజ్ రావ‌త్ , ఫీన్ అలెన్ , గ్లెన్ మాక్స్ వెల్ , వ‌నితు హ‌స‌రంగా , షాబాజ్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , డేవిడ్ విల్లీ , క‌ర‌ణ్ శ‌ర్మ‌, మ‌హిపాల్ లోమ్ మ‌ర్ , మ‌హ్మ‌ద్ సిరాజ్ , హేజిల్ వుడ్ , సిద్దార్థ్ కౌల్ , ఆకాశ్ దీప్ ల‌ను రిటైన్ చేసుకుంది.

ఇక జాస‌న్ , అనీశ్వ‌ర్ గౌతమ్, చామా మిలింద్ , సిసోడియా లువ్నిత్ , రూత‌ర్ ఫోర్డ్ ను ఆర్సీబీ విడుద‌ల చేసింది.

Also Read : అగ‌ర్వాల్ ను వ‌దులుకున్న పంజాబ్

Leave A Reply

Your Email Id will not be published!