Virat Kohli : ఆర్సీబీ విజ‌యం కోహ్లీ భావోద్వేగం

టైటిల్ కు కేవ‌లం రెండ‌డుగులు దూరం

Virat Kohli : ఐపీఎల్ 2022లో విచిత్ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన జ‌ట్లు సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ ప్ర‌తి ఏటా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన రిచ్ లీగ్ లో ఒక‌టిగా పేరొందింది ఐపీఎల్. 14 సీజ‌న్లు ముగిశాయి. ఈ ఏడాది 15వ సీజ‌న్ ముగిసేందుకు ఇంకా రెండు అడుగుల దూరంలో ఉంది.

గ‌తంలో 8 జ‌ట్లు పాల్గొంటే ఈసారి 10 జ‌ట్లు పాల్గొన్నాయి. ఈసారి ప్లే ఆఫ్స్ కు నాలుగు జ‌ట్లు చేరుకున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఉన్నాయి.

క్వాలిఫ‌యిర్ -1 లో గుజ‌రాత్ టైటాన్స్ రాజ‌స్తాన్ ను 7 వికెట్ల తేడాతో గెలుపొంది నేరుగా ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరింది. ఇక ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓడి పోయినా రెండో సారి కూడా ఛాన్స్ ఉంటుంది.

ఇది బిగ్ అడ్వాంటేజ్. ఇక కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో రాయ‌ల్స్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని గెలుపు.

ఈ స‌క్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ముంబై ఇండియ‌న్స్ ఓడించ‌డంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇక ఈ గెలుపుతో భార‌త మాజీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)  అంతులేని ఆనందంతో పాటు భావోద్వేగానికి లోన‌య్యాడు.

ఈ సంద‌ర్భంగా మ్యాచ్ అనంత‌రం హెడ్ కోచ్ సంజ‌య్ భంగ‌ర్ ను ఆలింగ‌నం చేసుకున్నాడు. ఇంకా టైటిల్ సాధించేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నామ‌న్నాడు. శుక్ర‌వారం రాజ‌స్తాన్ తో త‌ల‌ప‌డ‌నుంది ఆర్సీబీ.

Also Read : బెంగ‌ళూరు దెబ్బ ల‌క్నో అబ్బా

Leave A Reply

Your Email Id will not be published!