RCB vs LSG Police Hurt : హూడా దెబ్బకు పోలీస్ కు గాయం
కోల్ కతా ఈడెన్ మైదానంలో అరుదైన దృశ్యం
RCB vs LSG Police Hurt : కోల్ కతా వేదికగా ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 198 పరుగులు మాత్రమే చేసింది.
ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ 79 రన్స్ చేస్తే దీపక్ హూడా 45 రన్స్ చేశాడు. ఇదిలా ఉండగా లక్నో ఇన్నింగ్స్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. జట్టు బ్యాట్స్ మెన్ దీపక్ హూడా సిక్సర్ కొట్టాడు.
బంతి ప్రేక్షకులకు చేరువైంది. అక్కడే నిలబడిన ఓ పోలీస్(RCB vs LSG Police Hurt) ఆ బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అది అతడి చేతిలోకి రాక పోగా మణికట్టుకు తగిలి గాయమైంది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హూడా సిక్సర్ దెబ్బ పోలీస్ ను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేసింది. కాగా జట్టు తరపున మైదానంలోకి 4వ నంబర్ లో వచ్చాడు. కేఎల్ రాహుల్ తో కలిసి క్రీజులో ఉన్నాడు.
ఈ క్రమంలో దీపక్ హూడా 8వ ఓవర్ 5వ బంతికి సిక్సర్ బాదాడు. బంతి ప్రేక్షకులకు చేరింది. అదే సమయంలో స్టేడియంలో నిలబడి ఉన్న ఓ పోలీస్(RCB vs LSG Police Hurt) బాల్ ను తన వైపు నకు రావడం చూసి చేతులు ఎత్తాడు.
కానీ బంతి వేగం చాలా ఎక్కువగా ఉండడంతో అది అతడి చేతిని తాకింది. దీంతో తీవ్ర గాయమైంది. దీని వీడియోను ఐపీఎల్ తన వెబ్ సైట్ లో షేర్ చేసింది.
Also Read : రాహుల్ రాణించినా తప్పని ఓటమి