RCB vs LSG IPL Eliminator : బెంగ‌ళూరు దెబ్బ ల‌క్నో అబ్బా

వారెవ్వా ర‌జిత్ పాటిదార్ షాన్ దార్

RCB vs LSG IPL Eliminator : అదృష్టం త‌లుపు త‌డితే ఎలా ఉంటుందో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును చూస్తే చాలు. ప్లే ఆఫ్స్ కు ఢిల్లీ

పుణ్య‌మా అని చేరుకున్న ఆర్సీబీ(RCB vs LSG IPL Eliminator) ఊహించ‌ని రీతిలో ఐపీఎల్ టైటిల్ వేట‌లో తాను కూడా ఉన్నానంటూ ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరింది.

ఇక కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ లో ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో 14 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై విజ‌యాన్ని సాధించి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జ‌ట్లు చేరాయి. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాయి. చివ‌రి దాకా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. వాటిలో ఒక‌టి గుజ‌రాత్ టైటాన్స్ అయితే ఇంకోటి ల‌క్నో. టైటాన్స్ రాజ‌స్తాన్ ను ఓడించి ఏకంగా ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరింది.

ఇక ల‌క్నో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది(RCB vs LSG IPL Eliminator). బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ వేలంలో ఎవ‌రూ వ‌ద్ద‌నుకున్న ర‌జిత్ పటిదార్ ఆర్సీబీ పాలిట వ‌రంగా, బంగారంగా మారాడు. అత‌డి వ‌ల్లే ఇవాళ ల‌క్నోపై గెలుపు న‌మోదు చేసింది.

రెండు లీగ్ మ్యాచ్ ల అనంత‌రం సిసోడియా గాయ‌ప‌డ‌డంతో ప‌టిదార్ కు పిలుపు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచ్ లు ఆడాడు. అత‌డిపై

న‌మ్మ‌కం ఉంచిన మేనేజ్ మెంట్ మూడో ప్లేస్ లో పంపించింది.

దీంతో ల‌క్నో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్క‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఏకంగా సెంచ‌రీ చేసి జ‌ట్టును ఒడ్డుకు చేర్చాడు. త‌న

కెరీర్ లో అద్బుత‌మైన ఇన్నింగ్స్ న‌మోదు చేశాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 207 ర‌న్స్ చేసింది. ర‌జిత్ ప‌టిదార్ శివ‌మెత్తాడు. 54 బంతుల్లో

12 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 112 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

ఆఖ‌రులో వ‌చ్చిన దినేశ్ కార్తీక్ 23 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స్ తో 37 ర‌న్స్ చేశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించినా ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించ లేక పోయాడు. 58 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 3 ఫోర్లు 5 సిక్స్

ల‌తో 79 ర‌న్స్ చేశాడు. ఇక దీప‌క్ హూడా 26 బంతులు ఆడి 1 ఫోర్ 4 సిక్స్ ల‌తో రెచ్చి పోయాడు. 45 ప‌రుగులు చేశాడు.

Also Read : దినేష్ కార్తీక్ జోర్దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!