RCB vs RR IPL 2023 : స‌మ‌రానికి రాజ‌స్థాన్ బెంగ‌ళూరు రెఢీ

ఉత్కంఠ భ‌రితంగా మార‌నున్న మ్యాచ్

RCB vs RR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అస‌లైన పోరాటానికి వేదిక కానుంది ఆదివారం బెంగ‌ళూరు. న‌గ‌రంలోని చిన్న‌స్వామి స్టేడియంలో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బ‌లంగా ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RCB vs RR IPL 2023) జ‌ట్లు ఢీ కొనేందుకు రెడీ అయ్యాయి. ఇప్ప‌టికే టికెట్లు అన్నీ అయి పోయాయి. ఎందుకంటే సెల‌వు రోజు కావ‌డంతో ఐటీకి కేరాఫ్ గా ఉన్న బెంగ‌ళూరు ఇప్పుడు అభిమానుల‌తో నిండి పోయింది.

కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత్యల్ప స్కోర్ ను ఛేదించ లేక ఓట‌మి పాలైంది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో. ఐపీఎల్ లో అన్ని జ‌ట్ల కంటే అత్య‌ధిక బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన రాజ‌స్థాన్ ల‌క్నోతో మాత్రం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఒకానొక ద‌శ‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైశ్వాల్ , జాస్ బ‌ట్ల‌ర్ దంచి కొట్టారు.

10 ఓవ‌ర్ల‌కే 72 ప‌రుగులు చేశారు. ఒక వికెట్ కోల్పోయింది. ఈ త‌రుణంలో వెంట వెంట‌నే వికెట్లు కోల్పోయింది. ప్ర‌ధానంగా ఓట‌మికి కార‌ణంగా లేని ప‌రుగు కోసం వెళ్ల‌డంతో కీల‌క‌మైన కెప్టెన్ శాంస‌న్ ర‌నౌట్ గా వెనుదిరిగాడు. ఇక స్టార్ ఫినిష‌ర్ గా పేరొందిన షిమ్రోన్ హిట్మెయ‌ర్ అద్భుత‌మైన బంతికి బోల్తా ప‌డ్డాడు. స్టాయినిస్ , ఆవేష్ ఖాన్ దెబ్బ‌కు రాజ‌స్థాన్ కుప్ప కూలింది.

ఇక ఆర్సీబీ భారీ స్కోర్ న‌మోదు చేసినా ఓట‌మి పాలైంది చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో. శివ‌మ్ దూబే శివ‌మెత్త‌డం, ర‌వీంద్ర జ‌డేజా సూప‌ర్ ఇన్నింగ్స్ దెబ్బ‌కు ఆర్సీబీ చ‌తికిల ప‌డింది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది.

Also Read : చెన్నై చంద్రమా కోల్ క‌తా ర‌ణమా

Leave A Reply

Your Email Id will not be published!