RCB vs SRH IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ స్పీడ్ చాలెంజ‌ర్స్ జోష్

ర‌స‌వ‌త్త‌ర పోరుకు హైద‌రాబాద్..బెంగ‌ళూరు రెడీ

RCB vs SRH  : ప్రారంభంలో త‌డ‌బ‌డిన స‌న్ రైజ‌ర్స్ ఆ త‌ర్వాత దెబ్బ తిన్న పులిలా పుంజుకుంది. దిగ్గ‌జ జ‌ట్ల‌కు ఝ‌లక్ ఇస్తూ వ‌స్తోంది. ఇవాళ హైద‌రాబాద్ మ‌రో బ‌ల‌మైన జ‌ట్టుగా పేరొందిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో(RCB vs SRH )ఢీకొన‌నుంది.

ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ మ‌రింత ఉత్కంఠ‌ను రేపే చాన్స్ ఎక్కువ‌గా ఉంది. ఇరు జ‌ట్లు అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉన్నాయి. కానీ చివ‌రి దాకా ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్టం.

రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జ‌ట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రూథ‌ర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్

, వానిందు హ‌స‌రంగా, అనీశ్వ‌ర్ గౌత‌మ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజ‌ల్ వుడ్ ఆడ‌తారు. దినేశ్ కార్తీక్ , మ‌హిపాల్ లామ్రోర్ , అనుజ్ రావ‌త్ , డేవిడ్ విల్లీ,

ఫిన్ అలెన్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్ర‌భు దేశాయ్, షాబాద్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : మెరిసిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్

Leave A Reply

Your Email Id will not be published!