RCB Bowling Qualifier2 : ఆర్సీబీ ఆయుధం బౌలింగ్ బలం
రాజస్తాన్ బ్యాటర్లకు ఇక చుక్కలే
RCB Bowling Qualifier2 : అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం మోత మోగనుంది. శుక్రవారం కీలకమైన క్వాలిఫయిర్ -2 మ్యాచ్ కు వేదిక కానుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. ఉత్కంఠ భరిత పోరులో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే.
ఇరు జట్లు అన్ని ఫార్మాట్ లలో బలంగా కనిపిస్తున్నాయి. కానీ మైదానంలోకి వచ్చే దాకా సక్సెస్ ఎవరిని వరిస్తుందో ముందుగా చెప్పడం ఇబ్బందికరం.
ఇక బ్యాటింగ్ లో దుమ్ము రేపుతూ వస్తోంది రాజస్తాన్. ప్రధానంగా జైశ్వాల్, బట్లర్, పడిక్కల్ , శాంసన్ , అశ్విన్, హిట్ మైర్ , రియన్ పరాగ్ ఉన్నారు. వీరంతా బ్యాటర్లే. ఏ సమయంలో నైనా పరుగులు సాధించే వారే.
ఇక బెంగళూరు జట్టును చూస్తే డుప్లెసిస్ , గ్లెన్ మ్యాక్స్ వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, లిమ్రోన్ , దినేశ్ కార్తీక్ ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా
రాజస్తాన్ పేలవంగా ఉంది. ఆ జట్టు అశ్విన్, చాహల్ మీద ఆధార పడింది.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB Bowling Qualifier2) జట్టు రాజస్తాన్ కంటే ఓ మెట్టు పైన ఉంది బౌలింగ్ పరంగా. ప్రస్తుత సీజన్ లో డెత్ ఓవర్స్ లో అత్యంత ప్రమాదకర బంతుల్నివేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న వారిలో హర్షల్ పటేల్ , హాజిల్ వుడ్ , హసరంగ ఉన్నారు.
ఆ జట్టు బలం కూడా ఇదే. కీలకమైన మ్యాచ్ లో డెత్ బౌలింగ్ ముఖ్యం. ప్రధానంగా ఆర్సీబీకి బౌలింగ్ ఆయుధంగా మారింది. ఇక రాజస్తాన్ లో అశ్విన్, చాహల్ ఉన్నా ప్రభావం చూపలేక పోవడం ఇబ్బందికరంగా మారింది.
Also Read : విజయానికి అడుగు దూరంలో ఆర్సీబీ