RCB New Jersy WPL : ఆర్సీబీ కొత్త జెర్సీ హల్ చల్
సందడి చేసిన మహిళా క్రికెటర్లు
RCB New Jersy WPL : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో తొలిసారిగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చేపడుతోంది. వరల్డ్ క్రికెట్ లో ఏ దేశమూ దీనిని ప్రోత్సహించలేదు. కానీ భారత్ పొట్టి ఫార్మాట్ లో రిచ్ లీగ్ ను ప్లాన్ చేసింది.
బీసీసీఐ అంచనాలకు మించి ఆదరణ లభించింది. వేల కోట్లు సమకూరాయి. పురుషుల లీగ్ తో పోటీగా ప్రస్తుతం ఉమెన్స్ లీగ్ స్టార్ట్ కానుంది. మార్చి 4 నుంచి ముంబై వేదికగా టాటా డబ్ల్యుపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకు భారీ ఏర్పాట్లను చేసింది బీసీసీఐ.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మొత్తం 5 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను ప్రకటించాయి. ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన. రూ. 3.40 కోట్లకు చేజిక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సదరు యాజమాన్యం మరో సంచలన ప్రకటన కూడా చేసింది. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ను తమ జట్టుకు మెంటార్ గా నియమించింది.
తాజాగా ఆర్సీబీ తమ జట్టుకు సంబంధించి కొత్త జెర్సీని(RCB New Jersy WPL) ఆవిష్కరించింది. ఈ సందర్బంగా మహిళా క్రికెటర్లు సందడి చేశారు. ఆర్సీబీ టీంకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తోంది. ఎరుపు , నలుగు రంగులలో దీనిని రూపొందించారు. స్పాన్సర్ షిప్ తో పాటు ముందు భాగంలో కొన్ని మార్పులు చేసింది ఆర్సీబీ. ఇందులో స్మృతి మంధాన, రిచా ఘోష్ , రేణుకా సింగ్ , సోఫీ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
Also Read : మిథాలీ రాజ్ డ్యాన్స్ అదుర్స్