Reliance Jio Nokia : నోకియాతో రిలయన్స్ జియో ఒప్పందం
5జీ సేవల్లో పరికరాల ప్రొవైడర్ గా ఎంపిక
Reliance Jio Nokia : ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటికే దేశంలో అత్యున్నత 5జీ సర్వీసులను అందిస్తోంది. మొదట నాలుగు నగరాలు ఆ తర్వాత 13 నగరాలను ఎంపిక చేసింది. దశల వారీగా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు యత్నిస్తోంది.
ఇదే క్రమంలో ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో డౌన్ లోడ్ లో స్పీడ్ లో ఎయిర్ టెల్, మిగతా టెలికాం సంస్థల కంటే 5జీ స్పీడ్ లో టాప్ లో కొనసాగుతోంది రిలయన్స్ జియో అంటూ పేర్కొంది. ఈ తరుణంలో సదరు సంస్థ 5జీ (5G Services) సర్వీసులు అందించేందుకు గాను అవసరమైన పరికరాలను అందించే ప్రొవైడర్ గా ప్రముఖ ఫోన్ల తయారీ కంపనీ నోకియాను ఎంచుకుంది.
ఇదే విషయాన్ని సోమవారం రిలయన్స్ జియో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా రిలయన్స్ జియోకు 5జీ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ పరికరాలను అందజేయనుందని పేర్కొంది. ఇదిలా ఉండగా జియోకు దేశ వ్యాప్తంగా 420 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. దేశమంతటా వైర్ లెస్ సేవలను విస్తరించేందుకు జియో నోకియాను(Reliance Jio Nokia) ప్రధాన సరఫరాదారుగా ఎంచుకున్నట్లు ఫిన్నిస్ టెలికాం పరికరాల తయారీ సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు 5జీ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ పరికరాలను అందజేస్తామని పేర్కొంది. నోకియా తన ఎయిర్ స్కేల్ పోర్ట్ ఫోలియా నుండి బేస్ స్టేషన్లు, అధిక సామర్థ్యం కలిగిన 5జీ మాసివ్ మిమో యాంటెన్నాలు , వివిధ స్పెక్ట్రమ్ బ్యాండ్ లు , స్వీయ ఆర్గనైజింగ్ నెట్ వర్క్ సాఫ్ట్ వేర్ కు మద్దతు ఇచ్చేందుకు రేడియో హెడ్ లతో సహా పరికరాలను సరఫరా చేయనుంది.
Also Read : టెస్లాను ఢీకొనేందుకు ఓలా రెడీ – అగర్వాల్