Reliance Metro : రిటైల్ దిగ్గజం మెట్రో రిలయన్స్ పరం
స్వంతం చేసుకున్న దిగ్గజ సంస్థ
Reliance Metro : భారత దేశ వ్యాపార రంగంలో తీవ్ర ప్రభావం చూపుతున్న సంస్థలలో రిలయన్స్ , అదానీ, టాటా , మహీంద్రా ఉన్నాయి. రిటైల్ వ్యవహారంలో ఇప్పుడు విదేశాలకు చెందిన కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ఇక దేశంలో రిటైల్ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కంపెనీ. ఆయిల్, టెలికాం, జ్యుయెలరీ, దుస్తులు, రిటైల్ ఇలా ప్రతి రంగంలోకి విస్తరించింది.
తన వ్యాపార సామ్రాజాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరో కీలకమైన ప్రకటన చేసింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు రిటైల్ రంగంలో రారాజుగా వెలుగొందాలని ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కంపెనీని స్వంతం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Metro).
ఏకంగా భారీ ఎత్తున డీల్ కుదుర్చుకుంది. మొత్తం రూ. 2,850 కోట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ , మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కటి కానున్నాయి. ఈ కీలక ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై ఇరు కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులు సంతకాలు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా 2003లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం ప్రారంభమైంది ఇండియాలో. దేశంలోని 21 నగరాలలో 31 స్టోర్లు ఏర్పాటై ఉన్నాయి. మొత్తం 3 వేల 500 మందికి పైగా ఇందులో పని చేస్తున్నారు.
ముకేశ్ అంబానీ మెట్రోను స్వంతం చేసుకోవడం వెనుక పెద్ద మ్యాటరే దాగి ఉంది. ఎందుకంటే దేశమంతటా విస్తరించిన ఈ మెట్రోలో దాదాపు 6 లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. దీనిని టేకోవర్ చేసుకోవడం వల్ల ఏడాదికి రూ. 7 వేల కు పైగానే వ్యాపారం జరుగుతుందని అంచనా.
Also Read : త్వరలో సిఇఓ నుంచి తప్పుకుంటా