Renu Desai : ప్లీజ్ మమ్మల్ని లాగకండి – రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ మద్దతు
Renu Desai : ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు తల్లి అయిన ఆమె విడాకులు తీసుకున్నారు. వేరే వ్యక్తితో కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. రాజకీయంగా తనకు మద్దతు ఇస్తున్నానని, ఇందులో తప్పేముందంటూ రేణు దేశాయ్ ప్రశ్నించారు.
Renu Desai Comments About Pawan Kalyan
పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదన్నారు. ఆయనకు సమాజం పట్ల కొంత ఏదో చేయాలన్న తపన, కసి ఉందన్నారు. అందుకే ఎందరు వద్దన్నా రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. కొందరు ఆయనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారని దానిని ఆపాలని సూచించారు.
అంతే కాదు పవన్ కళ్యాణ్ పై , ఆయన వ్యక్తిగత జీవితంపై త్వరలో వెబ్ సీరీస్ కూడా తీస్తున్నట్లు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారని దయచేసి అలాంటి పని చేయకండి అని కోరారు రేణు దేశాయ్(Renu Desai). దయచేసి తనను, తన పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని సూచించారు.
Also Read : RS Praveen Kumar : కాజేశారు కోట్లు కొట్టేశారు – ఆర్ఎస్పీ