RBI Big Shock : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్

కీల‌క రేటును 5.40 శాతానికి పెంపు

RBI Big Shock : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. కీల‌క రేటును 0.50 శాతం నుండి 5.40 శాతానికి పెంచింది. 2019 సంవ‌త్స‌రం త‌ర్వాత అత్య‌ధికంగా పెంచ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

వ‌రుస‌గా ఇది మూడోసారి కావ‌డం విశేషం. ఆర్బీఐ(RBI Big Shock) శుక్ర‌వారం కీల‌క రుణ రేటు పెంచ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఎక్కువ‌గా ఉన్న పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేందుకు పెంచాల్సి వ‌చ్చింద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ స్ప‌ష్టం చేశారు.

జూన్ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 7 శాతం వ‌ద్ద ఉంది. ద్ర‌వ్య విధాన క‌మిటీ కీల‌క స‌మావేశంలో రుణ రేటు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

తాజా పెంపుతో రెపో రేటు లేదా బ్యాంకులు రుణాలు తీసుకునే స్వ‌ల్ప‌కాలిక రుణ రేటు 5.15 శాతం ప్రీ పాండ‌మిక్ స్థాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు శ‌క్తికాంత దాస్.

ఆర్బీఐ అంచ‌నాల‌కు అనుగుణంగా దాని రేట్ల పెంపును ఫ్రంట్ లోడ్ కొన‌సాగించింద‌న్నారు. రాబోయే నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం మోడ‌రేట్ కావ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు గ‌వ‌ర్న‌ర్.

కాగా ఈ ఒత్తిళ్ల చుట్టూ అనిశ్చితి ఎక్కువ‌గానే కొన‌సాగుతుంద‌న్నారు. ఈ రేట్ల పెంపు వ‌ల్ల ఆర్బీఐ రెపో రేటును 5.75 శాతానికి తీసుకు వెళుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రిన్సిపాల్ ఎకాన‌మిస్ట్ సాక్షి గుప్తా.

ఇదిలా ఉండ‌గా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ నేతృత్వంలోని ద్ర‌వ్య విధాన క‌మిటీ లోని ఆరుగురు స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఓటు వేశారు. ఈ పెంపు రూపాయిపై ఎఫెక్ట్ ప‌డుతుంద‌న్న‌ది వాస్త‌వం.

Also Read : సుప్రీంకోర్టులో 71 వేల‌ కేసులు పెండింగ్

Leave A Reply

Your Email Id will not be published!