Irani Cup 2022 : రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
సౌరాష్ట్రాను ఓడించి టైటిల్ కైవసం
Irani Cup 2022 : ఎట్టకేలకు దేశీయంగా ప్రాముఖ్యత కలిగిన ఇరానీ కప్ -2022ను(Irani Cup 2022) హనుమ విహారీ నాయకత్వంలోని రెస్టాఫ్ ఇండియా కైవసం చేసుకుంది. సౌరాష్ట్రతో జరిగిన కీలక మ్యాచ్ లో విజయకేతనం ఎగుర వేసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
105 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. బరిలోకి దిగిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. నాలుగో రోజు రెండు సెషన్ల లోపు మ్యాచ్ ను చేజిక్కించుకుంది రెస్టాఫ్ ఇండియా.
ముఖేష్ కుమార్ కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశాడు. కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చిన ముఖేష్ 4 కీలక వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 98 పరుగులకే ఆలౌట్ చేయడంలో సహాయ పడింది.
అనంతరం బరిలోకి దిగిన రెస్టాఫ్ ఇండియా భారీ స్కోర్ నమోదు చేసింది. 8 వికెట్లు కోల్పోయి 368 పరుగులు సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడాడు.
సెంచరీతో దుమ్ము రేపాడు. అభిమానుల మనసు దోచుకున్నాడు. వరుసగా దేశీవాలీ క్రికెట్ టోర్నీలో ఒక ఇయర్ లో 900 కు పైగా పరుగులు చేశాడు.
దీంతో 374 పరుగులకు పెంచేలా చేసింది. కాగా షెల్డర్ జాక్సన్ , అర్పిత్ వాసవాడ, ప్రేరక్ మన్కడ్ , కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ హాఫ్ సెంచరీలతో సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగుల లోటును అధిగమించింది.
ఇక నాలుగో రోజు కుల్దీప్ సేన్ చివరి ఇద్దరు బ్యాటర్లను మెరుపు పేస్ తో పెవిలియన్ పంపించడంతో సౌరాష్ట్ర కథ ముగిసింది. 94 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెస్టాఫ్ ఇండియా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
Also Read : ఫ్లైట్ మిస్ షిమ్రోన్ హెట్మెయర్ అవుట్