Revanth Reddy : కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ అమెరికాకు
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం అవుతానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). మంత్రి కేటీఆర్ అమెరికాకు పోవడం పక్కా అని జోష్యం చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతోందన్నారు. పార్టీకి సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Comments on KCR and KTR
ఆయా నియోజకవర్గాలలో బరిలో ఉన్న అభ్యర్థులు ఈవీఎంలపై కన్నేసి ఉంచాలని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన నేతలు, శ్రేణులు అక్కడే ఉండాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్ట పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమ వైపే ఉన్నాయని, సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని , తమ పార్టీలో అందరూ ఆ పోస్టు కోసం బరిలో ఉంటారని చెప్పారు. మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతరులు రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు.
మరో వైపు సునీల్ కనుగోలు పన్నిన వ్యూహం , రేవంత్ రెడ్డి దూకుడు ఆ పార్టీకి పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించ బోతోందని ప్రతి చోటా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి పూర్తి నమ్మకంతో ఉన్నారు తాను సీఎం అవుతానని.
Also Read : Sunil Kanugolu : కనుగోలు వ్యూహం హస్తం విజయం