Revanth Reddy : జనం గుండెల్లో దేవుడు పీజేఆర్
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఖైరతాబాద్ – ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజా తెలంగాణ దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దివంగత కార్మిక నాయకుడు, మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి తరపున ప్రచారం చేపట్టారు. భారీ ఎత్తున హాజరైన జనసందోహం చూసి ఉత్సాహంతో మాట్లాడారు.
Revanth Reddy Praises PJR
ఉమ్మడి ఏపీలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారంటూ జనార్దన్ రెడ్డి గురించి ప్రశంసలు కురిపించారు. ఆయన ఇవాళ మన మధ్య లేక పోయినా జనం గుండెల్లో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
ఆయన జీవిత కాలమంతా ప్రజల కోసం పని చేశాడని, పేదల తరపున తన గొంతు ఇచ్చాడని, ఏ ఒక్క రోజు రాజీ పడలేదని ప్రశంసించారు. అలాంటి గొప్ప నాయకుడి కూతురును గెలిపించు కోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు టీపీసీసీ చీఫ్.
ఖైరతాబాద్ అంటేనే రెండే రెండు గుర్తుకు వస్తాయని, ఒకటి గణేశుడు ఇంకొకరు జనార్దన్ రెడ్డి అని గుర్తు చేశారు.
Also Read : AP CID : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్