Pawan Kalyan : 25న తాండూరులో ప‌వ‌న్ రోడ్ షో

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం

Pawan Kalyan : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఏపీలో టీడీపీతో జ‌త క‌ట్టారు. కానీ విచిత్రంగా తెలంగాణ‌లో బీజేపీతో దోస్తానా చేస్తున్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల‌ను కేటాయించింది బీజేపీ.

Pawan Kalyan Road Show

తాజాగా తాండూరులో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింది. ఇందుకు గాను పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా రోడ్ షో చేప‌ట్టనున్నారు. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లేక హెలికాప్ట‌ర్ ద్వారా న‌వంబ‌ర్ 25న తాండూరుకు చేరుకుంటార‌ని తెలిపింది.

అక్క‌డ రోడ్ షో నిర్వ‌హిస్తార‌ని, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తార‌ని జ‌న‌సేన పార్టీ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏపీలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. అక్క‌డ జ‌గ‌న్ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా టీడీపీతో క‌లిసి స‌మ‌న్వ‌య క‌మిటీలు ఏర్పాటు చేస్తోంది జ‌న‌సేన పార్టీ. మొత్తంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేలా బీజేపీ, జ‌న‌సేన వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంది.

Also Read : Revanth Reddy : జ‌నం గుండెల్లో దేవుడు పీజేఆర్

Leave A Reply

Your Email Id will not be published!