DMK Support : కాంగ్రెస్ కు డీఎంకే మ‌ద్ద‌తు

అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన సీఎం

DMK Support : త‌మిళ‌నాడు – ఇండియా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న త‌మిళ‌నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడుకు చెందిన వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ప‌లు చోట్ల నివ‌సిస్తున్నారు. ప్ర‌ధానంగా ఐటీ, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌లో కీల‌క‌మైన పోస్టుల‌లో ఉన్నారు. ఇందులో భాగంగా మిత్ర‌పక్షం ఒప్పందం ప్ర‌కారం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

DMK Support to Congress

ఈ మేర‌కు తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 3న ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి.

ఇందులో భాగంగా తెలంగాణ‌లో పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి , 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల‌కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చింది. ఈ మేర‌కు డీఎంకే(DMK) సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఎంకే అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని మంగళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా త‌మ‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Pawan Kalyan : 25న తాండూరులో ప‌వ‌న్ రోడ్ షో

Leave A Reply

Your Email Id will not be published!