Bhatti Vikramarka : హ‌స్తం విజ‌యం త‌థ్యం – భ‌ట్టి

78 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ప‌క్కా

Bhatti Vikramarka : ఖ‌మ్మం జిల్లా – సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప‌దేళ్ల రాక్ష‌స పాల‌న అంతం కాబోతోంద‌ని, ఇక ప్ర‌జ‌లు కోరుకున్న జ‌న‌రంజ‌క పాల‌న రావ‌డం ఖాయ‌మ‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగించారు.

Bhatti Vikramarka Comment

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, కాంగ్రెస్ పార్టీ ప‌క్కాగా 119 సీట్ల‌కు గాను క‌నీసం 78 సీట్ల‌కు పైగానే కైవ‌సం చేసుకోబోతోంద‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇవాళ నీళ్లు , నిధులు, నియామ‌కాలు అనే ట్యాగ్ లైన్ తో కోరి కొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మిగిలింది ఏమీ లేద‌న్నారు.

కేవ‌లం ఒక్క క‌ల్వ‌కుంట్ల కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌ని, ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులుగా మ‌రార‌ని, రాష్ట్రంలో పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌వాబుదారీ త‌నం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తూ, కేవ‌లం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైన సీఎం కేసీఆర్ ను, ఆయ‌న ఫ్యామిలీని బొంద పెట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా మార్పు కోరుకుంటున్నార‌ని, హ‌స్తంకు ఓటు వేయాల‌ని నిర్ణ‌యించు కున్నార‌ని, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు .

Also Read : DMK Support : కాంగ్రెస్ కు డీఎంకే మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!