Revanth Reddy : కేసీఆర్ బ‌క్కోడు కాదు బ‌కాసురుడు

నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్

Revanth Reddy : న‌కిరేక‌ల్ – దొంగ‌ల‌కు మించిన గ‌జ దొంగ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా న‌కిరేక‌ల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి వేముల వీరేశం త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు.ఈ సంద‌ర్బంగా జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తూ నిప్పులు చెరిగారు కేసీఆర్ ను, ఆయ‌న ఫ్యామిలీపై.

Revanth Reddy Comments on KCR

ఎస్ఎల్బీసీని ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు టీపీసీసీ చీఫ్‌. కేసీఆర్ బ‌క్కోడు కాదు బ‌కాసురుడు అంటూ మండిప‌డ్డారు. ప‌డుకుంటే కుంభ‌క‌ర్ణుడు అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). 60 ఏళ్ల‌లో 16 మంది సీఎంలు చేసిన అప్పు 69 వేల కోట్లు. కానీ ప‌దేళ్ల‌లో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు 6 ల‌క్ష‌ల కోట్లు చేశాడంటూ ఆరోపించారు.

ఎవ‌డు దొంగ ఎవ‌డు గ‌జ దొంగ అనేది తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని అన్నారు. న‌ల్ల‌గొండ గ‌డ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో 12 స్థానాల‌కు గాను 12 స్థానాల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

నీళ్లు నిధులు, నియామ‌కాల పేరుతో కోరి తెచ్చుకున్న తెలంగాణను స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలిని త‌న్ని త‌రిమి కొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!