Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.4 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని , క‌ష్టాలు తొల‌గి పోతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ న‌మ్మ‌కం. సుదూర ప్రాంతాల నుండి, దేశ‌, విదేశాల నుండి స్వామి ద‌ర్శ‌నం కోసం వారికి పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌స్తారు.

Tirumala Rush with Devotees

మ‌రో వైపు రోజు రోజుకు పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (TTD) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా స్వామి వారి సేవ‌కులు భ‌క్తుల‌కు సేవ‌లు అందిస్తున్నారు.

మొన్న భ‌క్తుల సంఖ్య త‌గ్గినా ఉన్న‌ట్టుండి నిన్న శుక్ర‌వారం ఒక్క రోజే భారీ ఎత్తున పెర‌గ‌డం విశేషం. స్వామి, అమ్మ వార్ల‌ను 74 వేల 843 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 23 వేల 776 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.4 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. 9 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉండ‌గా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం క‌నీసం 4 గంట‌ల‌కు పైగా ప‌ట్టే ఛాన్స్ ఉంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా సామ‌న్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు చేప‌ట్టిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.

Also Read : Telangana BJP Comment : పాగా వేసేనా ప‌వ‌ర్ లోకి వ‌చ్చేనా

Leave A Reply

Your Email Id will not be published!