Revanth Reddy : మామా అల్లుళ్ల వల్లనే రైతు బంధుకు బ్రేక్
నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్
Revanth Reddy : డోర్నకల్ – కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు పథకం నిధుల పంపిణీని నిలిపి వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్నకల్ లో జరిగిన విజయ భేరి సభలో ప్రసంగించారు. కేసీఆర్ అతి తెలివి వల్లనే రైతు బంధు ఆగి పోయిందని ఆరోపించారు.
Revanth Reddy Comments on KCR and Harish Rao
గులాబీ నేతల నోటి దూల వల్లనే నిలిచి పోయిందంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఓ వైపు మామ కేసీఆర్ ఇంకో వైపు అల్లుడు హరీశ్ రావు లు రైతు బంధును ఎన్నికల కోసం వేయకుండా నిలిపి వేశారంటూ ఆరోపించారు.
కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు. అయినా ఎన్ని కుట్రలు పన్నినా, ఇంకెన్ని వ్యూహాలు అమలు చేసినా తెలంగాణలో వర్కవుట్ కాదన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు తమకు అధికారం కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారని ఇక కేసీఆర్ , ఆయన కుటుంబం జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.
తాము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ అవినీతి , స్కామ్ లను వెలికి తీస్తామన్నారు. ఆ వెంటనే చెర్లపల్లి జైలుకు తరలిస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
Also Read : KC Venu Gopal : దొరను రైతులు క్షమించరు