Revanth Reddy : కొడంగల్ గడ్డకు నమస్కరిస్తున్నా
కడుపులో పెట్టుకుని చూసుకుంటా
Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేసులో ఉన్న టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు చోట్ల బరిలో నిలువగా కొడంగల్ నియోజకవర్గంలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యారు.
Revanth Reddy Comment
కొడంగల్ లో తనను గెలిపించడంపై తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు తన ఇంటి నుండి గాంధీ భవన్ కు భారీ ర్యాలీగా విచ్చేశారు. ఈ సందర్బంగా తన విజయాన్ని కొడంగల్ ప్రజలకు అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణ ఆత్మ గౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగర వేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కొన ఊపిరి ఉన్నంత వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తానని స్పష్టం చేశారు. కష్ట కాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉన్నానని అన్నారు. వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని పేర్కొన్నారు.
ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని, దేశానికి కొడంగల్ ను ఒక రోల్ మోడల్ గా నిలబెడతానని ప్రకటించారు.
Also Read : Damodara Raja Narasihma : దామోదర రాజనర్సింహ గెలుపు