RGV : ప‌బ్ లో ఆర్జీవీ హ‌ల్ చ‌ల్

అమ్మాయిల‌తో డ్యాన్స్

RGV : సంచ‌ల‌నాల‌కు, వివాదాస్ప‌ద కామెంట్స్ కు పెట్టింది పేరు రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవీ. లైఫ్ అన్న‌ది ఒక్క‌సారే వ‌స్తుంద‌ని ఉన్న స‌మ‌యాన్ని ఫుల్ ఎంజాయ్ చేయాల‌న్న‌ది వ‌ర్మ ఫిలాస‌ఫీ.

ఇప్ప‌టికే ఆయ‌న సోష‌ల్ మీడియాలో స్టార్ గా ఉన్నారు. తెలుగు, హిందీ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ఆర్జీవీ(RGV) ఆ మ‌ధ్య ఓ బోల్డ్ బ్యూటీతో మూవీ తీసి వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

కొంత మందితో డ్యాన్సు చేస్తూ హ‌ల్ చేశాడు. తాజాగా మ‌రోసారి ప‌బ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం అవి వైర‌ల్ గా మారాయి.

నిత్యం ఏదో ఒక దానితో సంచ‌ల‌నంగా ఉంటూ రావ‌డం ప‌రిపాటిగా మారింది వ‌ర్మ‌కు. హైద‌రాబాద్ లోని ఓ ప‌బ్ లో దుమ్ము రేపాడు. అంద‌మైన అమ్మాయిల‌తో డ్యాన్సులు చేస్తూ హ‌ల్ చ‌ల్ చేశాడు.

ఆర్జీవీ ఏది చేసినా లేక ఏది మాట్లాడినా అది ట్రెండింగ్ లో ఉంటోంది. దీంతో మీడియా సైతం ఆయ‌న‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంది.

దీంతో ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే పాపుల‌ర్ అవుతున్నారు వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌లు వివాదాస్ప‌ద కామెంట్స్ , వీడియోల‌తో తీవ్ర దుమారం రేపిన ఆర్జీవీ(RGV) మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు.

తాజాగా ఓ ప‌బ్ లో మందేసి అమ్మాయిల‌తో డ్యాన్సు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇందులో ఆర్జీవీ చుట్టూ అమ్మాయిలు ఉన్నారు. ఓ అమ్మాయిని గ‌ట్టిగా హ‌త్తుకుని ముద్దులు కూడా పెట్టాడు.

వీడియోతో పాటు వ‌ర్మ పోస్ట్ చేసిన ఫోటోకి క్యాప్ష‌న్ ఇస్తే ల‌క్ష బ‌హుమ‌తి ఇస్తాన‌ని ప్ర‌క‌టించడం విశేషం. త‌న లేటెస్ట్ మూవీ కొండా ట్రైల‌ర్ ను రిలీజ్ చేసిన కొన్ని గంట‌ల్లోనే పబ్ లో ఎంట‌ర్ కావ‌డం విచిత్రం.

Also Read : చై సామ్ విడాకుల‌పై నాగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!