RGV Prashanth Neel : ద‌మ్మున్నోడు కేజీఎఫ్‌-2 డైరెక్ట‌ర్ – ఆర్జీవీ

డైరెక్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

RGV Prashanth Neel : భార‌తీయ సినిమాను షేక్ చేస్తోంది య‌శ్ న‌టించిన కేజీఎఫ్ -2 మూవీ. ఇప్ప‌టికే విడుద‌లై కోట్లు కొల్ల‌గొడుతోంది. పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన ఈ చిత్రం ఓవ‌ర్సీస్ లోనూ బాక్సు బ‌ద్ద‌లు కొడుతోంది.

ఓ వైపు జ‌క్క‌న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ దూసుకు వెళుతుండ‌గా ఇంకో వైపు క‌న్న‌డ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ సీక్వెల్ చిత్రం సూప‌ర్ టాక్ తెచ్చుకుంది.

రిలీజైన మొద‌టి రోజే రికార్డు బ్రేక్ చేసింది వ‌సూళ్ల ప‌రంగా. ఆర్ఆర్ఆర్ వ‌ర్సెస్ కేజీఎఫ్ -2 నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రం హ‌వా న‌డుస్తోంది.

టాలీవుడు, మాలివుడ్, కోలివుడ్, బాలీవుడ్, శాండ‌ల్ వుడ్ ఇలా అన్ని చోట్లా కేజీఎఫ్ -2 సృష్టిస్తున్న ప్రభంజ‌నం గురించే. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

ప్ర‌ధానంగా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ టేకింగ్, య‌శ్ సూప‌ర్ యాక్టింగ్ కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక విడుద‌లైన తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 135 కోట్లు కొల్ల‌గొట్టింది. వ‌సూలైన వాటిలో దాదాపు బాలీవుడ్ నుంచే రూ. 50 కోట్లు రావ‌డం విశేషం.

ఫిల్మ్ క్రిటిక్స్ కేజీఎఫ్ గురించి ఆస‌క్తిక‌ర అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(RGV) (ఆర్జీవీ) ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ నీల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మూవీతో బాలీవుడ్ తేరుకునేందుకు కొన్నేళ్లు ప‌డుతుంద‌ని పేర్కొన్నాడు. రాఖీ బాయ్ దాడి ఒక్క ముంబైనే కాదు యావ‌త్ భారతానికి షాక్ ఇచ్చాడంటూ తెలిపాడు.

మొత్తంగా య‌శ్ తో పాటు డైరెక్ట‌ర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు ఆర్జీవీ.

Also Read : ఢిల్లీ ఫైల్స్ పేరుతో మూవీ – డైరెక్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!