RGV Pawan Kalyan : గుర్తే లేని పార్టీ నుంచి సీఎం ఎలా
పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్
RGV Pawan Kalyan : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. అవగాహన రాహిత్యంతో ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ పోతే చివరకు జనం నిన్ను నమ్మరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సీఎం కావాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయని ఆ విషయం తెలుసు కోకుండా ఎలా మాట్లాడతావంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ను ఆర్జీవీ.
ట్విట్టర్ వేదికగా శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావాలంటే కనీసం 88 సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అంటే నియోజకవర్గాలలో జనసేన పార్టీ తరపున పోటీ చేయాలి. మనకొక పార్టీ అంటూ ఉండాలి. పోనీ జనసేన ఉందని అనుకుందాం. ఆ పార్టీ ఉన్నా దానికి గుర్తింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎవరిని నమ్మించడానికి ఇలా మాయ మాటలు చెబుతున్నావంటూ పవన్ కళ్యాణ్ ను నిలదీశారు ఆర్జీవీ(RGV).
ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు గ్లాస్ ను రద్దు చేసింది. ఎందుకంటే కనీసం ఓటు శాతం కలిగి ఉండాలి. మరి ఎన్నికల గుర్తే లేని పార్టీని ఎలా బరిలో నిలిచేలా చేస్తావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అన్నారు ఆర్జీవీ. ఇదిలా ఉండగా ప్రస్తుం ఆర్జీవీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Pawan Kalyan : జవాబుదారీతనం జనసేన లక్ష్యం