Ricky Ponting : ర‌హానే స‌రైనోడు కోహ్లీ ద‌మ్మున్నోడు

బ్యాట‌ర్ గా రాణిస్తాడ‌న్న పాంటింగ్

Ricky Ponting  : ఆసిస్ క్రికెట్ లెజెండ్ రికీ పాంటింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. స‌ఫారీ టూర్ సంద‌ర్భంగా తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు కోహ్లీ.

ఇదిలా ఉండ‌గా ఈ త‌రుణంలో ఇంత త్వ‌ర‌గా కోహ్లీ రాజీనామా చేస్తాడ‌ని తాను అనుకోలేద‌న్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting). అత‌డు ఎందుకు ఇలాంటి ఆక‌స్మిక నిర్ణ‌యం తీసుకున్నాడో త‌న‌కు అర్థం కాలేద‌ని పేర్కొన్నాడు.

ఇక అజింక్యా ర‌హానే కు కూడా కితాబు ఇచ్చాడు రికీ పాంటింగ్. టెస్టు సార‌థిగా అత‌డికి మంచి మార్కులే ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన టూర్ లో మ్యాచ్ లను గెలిపించిన విధానం అద్భుత‌మ‌న్నాడు.

టెస్టు కెప్టెన్సీ విష‌యంలో కేఎల్ రాహుల్ కంటే రోహిత్ శ‌ర్మ బెస్ట్ ఛాయిస్ అని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. కెప్టెన్సీ నుంచి కోహ్లీ త‌ప్పుకున్న‌ప్ప‌టికీ బ్యాట‌ర్ గా అద్భుతంగా రాణించ గ‌ల‌డ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు రికీ పాంటింగ్(Ricky Ponting).

స‌త్తా చాటేందుకు కోహ్లీకి వ‌య‌సు కూడా మించి పోయింది ఏమీ లేద‌న్నాడు. త‌న‌కు కేవ‌లం 33 ఏళ్లు మాత్ర‌మేన‌ని ఇంకా భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

అజింక్యా ర‌హానేతో తాను క‌లిసి ప‌ని చేశాన‌ని అత‌డు ఫామ్ లేమితో ఉన్న‌ప్ప‌టికీ అద్భుత‌మైన ప్లేయ‌ర్ అని పేర్కొన్నాడు రికీ పాంటింగ్.

ర‌హానేలో గొప్ప ల‌క్ష‌ణం ఏమిటంటే ఎక్క‌డా సంయ‌మ‌నం కోల్పోక పోవ‌డం త‌న‌ను ఇష్ట ప‌డేలా చేసింద‌న్నారు.

Also Read : నేస్త‌మా నీ విజ‌యం అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!