Riley Russo : సత్తా చాటిన రిలే రుస్సో
బెంగళూరు బౌలర్లకు చుక్కలు
Riley Russo : ఐపీఎల్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది డేవిడ్ వార్నర్ సేన. వరుస పరాజయాలతో నిరాశ పరుస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన , విజయాలతో దూసుకు పోతున్న ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఎవరూ కూడా టార్గెట్ ను సునాయసంగా ఛేదిస్తారని అనుకోలేదు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ కీలక మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగింది ఢిల్లీ క్యాపిటల్స్.
182 పరుగుల ఛేదనకు దిగిన ఢిల్లీ స్కిప్పర్ వార్నర్ , మిచెల్ మార్ష్ ధాటిగా ఆడడం మొదలు పెట్టారు. వార్నర్ 22 రన్స్ చేస్తే మార్ష్ 20 పరుగులతో రాణించారు. విచిత్రం ఏమిటంటే ఆరంభం నుంచే దాడి ప్రారంభమైంది. బౌలర్లను చితక్కొట్టారు. ప్లే ఆఫ్ ముగిసే లోపే 70 పరుగులు దాటేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 87 రన్స్ చేశాడు. ఒకే ఒక్కడై దంచి కొట్టాడు. సాల్ట్ ఓ వైపు రెచ్చి పోయి ఆడుతుంటే మరో వైపు రిలే రుస్సో(Riley Russo) సెన్సేషన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 35 రన్స్ చేశాడు చివరి దాకా ఉన్నాడు. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి ఢిల్లీకి చిరస్మరణీయమైన గెలుపు అందించాడు.
Also Read : శివమెత్తిన సాల్ట్ బెంగళూరుకు షాక్