Rilee Rossouw : చిత‌క్కొట్టిన రిలీ రోసౌవ్

37 బంతులు 82 ర‌న్స్

Rilee Rossouw : ఐపీఎల్ లీగ్ లో ప్లే ఆఫ్ ఆశ‌లు పెట్టుకున్న శిఖ‌ర్ ధావ‌న్ సేన‌కు చుక్క‌లు చూపించింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. ధ‌ర్మ‌శాల‌లో ప‌రుగుల వర‌ద పారింది. ఇరు జ‌ట్లు క‌లిసి 400కు పైగా ర‌న్స్ చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 213 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ మ‌రోసారి స‌త్తా చాటాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 46 ర‌న్స్ చేశాడు. ఈ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఢిల్లీ స్టార్ హిట్ట‌ర్ పృథ్వీ షా ఫామ్ లోకి వ‌చ్చాడు. 7 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో రెచ్చి పోయాడు. 54 ర‌న్స్ చేశాడు.

వార్న‌ర్ ఔట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన రిలీ రోసౌవ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. పృథ్వీ షాతో క‌లిసి రెండో వికెట్ కు 54 ప‌రుగులు జోడించాడు. కేవ‌లం 37 బంతులు ఎదుర్కొన్న రిలీ రోసౌవ్ 6 ఫోర్లు 6 సిక్స‌ర్లు కొట్టాడు. 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మొత్తం ప‌రుగుల్లో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో క‌లిపి 60 ప‌రుగులు వ‌చ్చాయి. ఫాస్టెస్ట్ ఫిప్టీ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాల్ట్ కూడా దంచికొట్టాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ భారీ స్కోర్ చేసింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చివ‌రి దాకా పోరాడింది. 8 వికెట్లు కోల్పోయి 198 ర‌న్స్ చేసింది. ఆ జ‌ట్టులో లియామ్ లివింగ్ స్టోన్ చించి ఆరేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

Also Read : Prithvi Shaw

Leave A Reply

Your Email Id will not be published!