Rinku Singh : రింకూ సింగ్ బ్యాటింగ్ సూప‌ర్

కోల్ క‌తా గెలుపులో కీల‌క పాత్ర

Rinku Singh : ఎవ‌రీ రింకు సింగ్ అని అనుకుంటున్నారా. ఐపీఎల్ లో కూల్ గా బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరిశాడు. విజ‌యానికి అవ‌స‌ర‌మైన 153 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా చివ‌రి దాకా నిల‌బ‌డి జ‌ట్టును గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

42 ర‌న్స్ చేసి మెరిశాడు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 152 ర‌న్స్ చేసింది.

అనంత‌రం 153 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించింది.

నితీష్ రాణాతో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశాడు రింకూ సింగ్(Rinku Singh).

రాణా 37 బంతులు ఎదుర్కొని 48 ప‌రుగులు చేస్తే రింకూ సింగ్ కేవ‌లం 23 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 42 ర‌న్స్ చేయ‌డం విశేషం.

ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ఒక్క‌డే రాణించాడు ఆ జ‌ట్టు త‌ర‌పున 54 ర‌న్స్ చేశాడు.

బ‌ట్ల‌ర్ 22 ర‌న్స్ చేస్తే హిట్ మైర్ 27 ర‌న్స్ తో మెరిశాడు. రింకూ సింగ్ పూర్తి పేరు రింకూ ఖంచంద్ సింగ్ .

12 అక్టోబ‌ర్ 1997లో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోన అలీఘ‌ర్ లో పుట్టాడు. వ‌య‌సు 24 ఏళ్లు. 2014లో ఉత్త‌ర ప్ర‌దేశ్ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. 2017లో పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్ రింకూ సింగ్ ను ఐపీఎల్ లో తీసుకుంది.

బ్యాట‌రే కాదు బౌల‌ర్ కూడా. అండ‌ర్ -16, అండ‌ర్ -19 , అండ‌ర్ -23 స్థాయిలో యూపీకి ప్రాతినిధ్యం వ‌హించాడు. అండ‌ర్ -19 స్థాయిలో సెంట్ర‌ల్ జోన్ నుంచి ఆడాడు.

30 మే 2019న ఆడేందుకు ముంద‌స్తు ప‌ర్మిష‌న్ తీసుకోకుండా అబుదాబిలో జ‌రిగిన రంజాన్ టీ20లో పాల్గొన్నందుకు బీసీసీఐ అత‌డిపై మూడు నెల‌ల పాటు స‌స్పెన్ష‌న్ విధించింది.

Also Read : రుతురాజ్ గైక్వాడ్ సూప‌ర్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!