Rinku Singh Comment : నిన్న‌ స్వీప‌ర్ నేడు మ్యాచ్ విన్న‌ర్

ఎవ‌రీ రింకూ సింగ్ ఏమిటా క‌థ‌

ఐపీఎల్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెందిన రింకూ సింగ్ చ‌రిత్ర సృష్టించాడు. అసాధార‌ణ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టున్నాడు. ఎలాంటి ఆశ‌లు లేని స్థితిలో మైదానంలోకి వ‌చ్చిన రింకూ సింగ్ దుమ్ము రేపాడు. ఏకంగా ఆఖ‌రి ఓవ‌ర్ లో 5 సిక్స‌ర్లు కొట్టాడు. ఇంత‌కూ రింకూ సింగ్ ఎవ‌రు అని అనుమానం రాక త‌ప్ప‌దు. ఐపీఎల్ పుణ్య‌మా అని యువ ఆట‌గాళ్ల పంట పండుతోంది. భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌క పోయినా త‌మ ప్ర‌తిభ‌తో రాణిస్తున్నారు.

రింకూ సింగ్ ఐపీఎల్ లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. విచిత్రం ఏమిటంటే రింకూ సింగ్ ఒక‌ప్పుడు స్వీప‌ర్ గా ప‌ని చేశాడు. రింకూ తండ్రి ఎల్పీజీ సిలిండ‌ర్ల‌ను హోమ్ డెలివ‌రీ చేస్తాడు. అన్న ఆటో రిక్షా న‌డుపుతాడు. కానీ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా హీరోగా మారి పోయాడు.

ఇప్ప‌టి దాకా క్రికెట్ లో కొంత మంది బ్యాట‌ర్లు ఒక ఓవ‌ర్ లో ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డం చూశాం. ర‌వి శాస్త్రి, యువ‌రాజ్ సింగ్ , హ‌ర్ష‌ల్ గిబ్స్ వంటి ఆట‌గాళ్లు ఈ ఘ‌న‌త సాధించారు. కాగా భారీ స్కోర్ ను ఛేదించే క్ర‌మంలో వ‌రుస‌గా ఐదు సిక్స‌ర్లు బాద‌డం క్రికెట్ ఆట‌లో అరుదైన విష‌యం. కార్లోస్ బ్రాత్ వైట్ ఇంగ్లండ్ తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ 2016 ఫైన‌ల్ లో సిక్స‌ర్లు కొట్టాడు. ర‌హుల్ తెవాటివా 2020లో జ‌రిగిన మ్యాచ్ లో సిక్స‌ర్లు బాదాడు. గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన య‌శ్ ద‌యాల్ కు చుక్క‌లు చూపించాడు.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు ఒకే ఒక్క ఓవ‌ర్ ఉంది. గెల‌వాలంటే 29 ప‌రుగులు కావాలి. అంతా గుజ‌రాత్ విజ‌యం ఖాయ‌మ‌ని డిసైడ్ అయి పోయారు. కానీ ఉన్న‌ట్టుండి పూన‌కం వ‌చ్చిన వ్య‌క్తిలా ఆడాడు రింకూ సింగ్. ఏకంగా ఆఖ‌రు ఐదు బాల్స్ ను 5 సిక్స‌ర్లు కొట్టాడు. అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. గెల‌వాల‌న్న క‌సి ఉంటే ల‌క్ష్యం అన్న‌ది ఎంత పెద్ద‌దిగా ఉన్నా చిన్న‌దై పోతుంద‌ని రింకూ సింగ్ ఆట తీరుతో తేలి పోయింది. ద‌యాల్ కు నిద్ర లేకుండా చేశాడు . కేవ‌లం 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దివాడు. కానీ అత‌డికి క్రికెట్ అంటే పిచ్చి. అదే అత‌డిని హీరోను చేసింది. క‌ష్ట ప‌డ్డాడు కేకేఆర్ దృష్టిలో ప‌డ్డాడు.

ఈ యువ‌కుడిని రూ. 80 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. 2013లో యూపీ అండ‌ర్ -16 జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. కొన్నేళ్ల త‌ర్వాత అండ‌ర్ -19 లో చోటు ద‌క్కించుకున్నాడు. 2018లో త్రిపుర‌తో జ‌రిగిన మ్యాచ్ లో 44 బంతులు ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. 2017లో పంజాబ్ రూ. 10 లక్ష‌లు మాత్ర‌మే . కానీ కోల్ క‌తా తీసుకునే వ‌ర‌కు విలువ పెరిగింది. గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో మార‌థాన్ ఇన్నింగ్స్ తో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా…ప్ర‌పంచ క్రికెట్ లో హీరోగా మారి పోయాడు రింకూ సింగ్. గెలవాలంటే క‌ష్టాలు ఉండాల్సిందేనంటాడు ఈ క్రికెట‌ర్. అడ్డంకులు అధిగ‌మించి అసాధార‌ణ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్న రింకూ సింగ్ నేటి యువ‌త‌కు స్పూర్తి దాయ‌కం అని చెప్ప‌క త‌ప్ప‌దు. హ్యాట్సాఫ్ ఆఫ్ యూ రింకూ సింగ్.

Leave A Reply

Your Email Id will not be published!