Rinku Singh : లక్నోను భయపెట్టిన రింకూ సింగ్
కోల్ కతా నైట్ రైడర్స్ లో ఒకే ఒక్కడు
Rinku Singh : యూపీ కుర్రాడు రింకూ సింగ్(Rinku Singh) మరోసారి భయపెట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు చుక్కలు చూపించాడు. రెచ్చి పోయి ఆడాడు. లక్నో బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు. ఏ మాత్రం ఒక్క బాల్ ఛాన్స్ ఉన్నా కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచి ఉండేది. ఈ మొత్తం ఐపీఎల్ 16వ సీజన్ లో ఇంతలా ఉత్కంఠ రేపిన మ్యాచ్ లేదు.
నువ్వా నేనా అన్నంతగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. అనంతరం 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది కోల్ కతా నైట్ రైడర్స్. లక్నో బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. 12 బంతుల్లో 41 రన్స్ చేయాల్సిన పరిస్థితి. కానీ మైదానంలో ఉన్నది రింకూ సింగ్. జట్టును గెలిపించే బాధ్యతను తానే వేసుకున్నాడు.
2 ఓవర్లలో 4 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. 40 రన్స్ పిండుకున్నాడు. భయపెట్టాడు లక్నోను. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. జాసన్ రాయ్ 47 రన్స్ చేశాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
సిక్స్ కొట్టేందుకని వెళ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది కేకేఆర్. కోల్‌కతా బౌలర్లలో నరైన్, శార్దూల్, వైభవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : Nicholas Pooran