Rishab Pant DDCA : కోలుకుంటున్న రిషబ్ పంత్ – డీడీసీఏ
ప్రైవేట్ సూట్ కు తరలింపు
Rishab Pant DDCA : రూర్కీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నారు. ఇదే సమయంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
పంత్ తల్లితో ఫోన్ లో మాట్లాడారు. ఎలాంటి సాయం కావాలన్నా కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆదివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ ను పరామర్శించారు. పంత్ ఆరోగ్యం గురించి సీఎంకు ఆస్పత్రి వైద్యులు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం ధామి మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. మరో వైపు బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా ఆరా తీశారు. బీసీసీఐ వీలైతే విదేశాలలో కూడా మెరుగైన వైద్యం కోసం అయ్యే ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోయేషన్ (డీడీసీఏ) కీలక ప్రకటన చేసింది సోమవారం. రిషబ్ పంత్ ఆరోగ్యం(Rishab Pant DDCA) నిలకడగా ఉందని వెల్లడించింది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. వీలైతే ఢిల్లీకి కూడా తరలించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఇన్ఫెక్షన్ భయం వల్ల ప్రైవేట్ సూట్ కు మార్చినట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు. రిషబ్ పంత్ ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు.
Also Read : సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా