Rishabh Pant Airlifted : సర్జరీ కోసం పంత్ ఢిల్లీకి తరలింపు
విమానాంలో తరలించే అవకాశం ఉంది
Rishabh Pant Airlifted : రూర్కీలో తన కుటుంబాన్ని కలిసేందుకు ఢిల్లీ నుంచి కారులో బయలు దేరిన క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన పంత్ ను డ్రైవర్ రక్షించాడు. ఘటనా స్థలం నుంచి రూర్కీకి తరలించారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు.
ఆరోగ్య పరంగా ఎలాంటి ఖర్చునైనా తామే భరిస్తామని ప్రకటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడిన రిషబ్ పంత్ కు సర్జరీ చేయాల్సి(Rishabh Pant Airlifted) ఉందని సమాచారం. దీంతో శస్త్ర చికిత్స కోసం రిషబ్ పంత్ ను ఢిల్లీకి విమానంలో తరలించనున్నట్లు సమాచారం.
స్టార్ క్రికెటర్ ను పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు డీడీసీఏ టీమ్ డెహ్రాడూన్ లోని మాక్స్ హాస్పిటల్ లో ఉంటుందని ఢిల్లీ , డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు. అవసరమైతే ఫ్లైట్ లో పంపిస్తామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీకి వస్తుండగా హమ్మద్ పూర్ ఝూల్ సమీపంలో రూర్కీ నర్సన్ సరిహద్దులో పంత్ కారు డివైడర్ ను ఢీకొంది. దీంతో తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు.
డీడీసీఏ టీం రిషబ్ పంత్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అవసరమైతే వెంటనే ఢిల్లీకి కూడా తరలించే ఆలోచనలో ఉన్నామని పేర్కొంది. ప్రత్యేక ఫ్లైట్ లో కూడా తరలిస్తామని, ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీసీసీఐ కార్యదర్శి, ఉత్తరాఖండ్ సీఎం ధామి కూడా సహాయం అందజేస్తామని ప్రకటించారని వెల్లడించింది.
Also Read : సౌదీ ఫుట్ బాల్ క్లబ్ తో రొనాల్డో బిగ్ డీల్