Rishabh Pant : వ‌న్డే సీరీస్ కు రిష‌బ్ పంత్ దూరం

టెస్టు సీరీస్ కు తిరిగి వ‌చ్చే ఛాన్స్

Rishabh Pant : గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న రిష‌బ్ పంత్ పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తూ వ‌స్తోంది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు. అత‌డిని కంటిన్యూగా కొన‌సాగిస్తూ వ‌స్తోంది. ఆపై అద్భుతంగా రాణిస్తున్నా కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టింది.

ఈ త‌రుణంలో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో బంగ్లా టూర్ కు వెళ్లింది. ఇప్ప‌టికే ట్రైనింగ్ స‌మ‌యంలో భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ గాయ‌ప‌డ్డాడు. అత‌డి ప్లేస్ లో బీసీసీఐ జ‌మ్మూ కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసింది. ఇవాళ వ‌న్డే మ్యాచ్ కొన‌సాగుతోంది.

ఇదే స‌మ‌యంలో వికెట్ కీప‌ర్ గా ఎంపిక చేసిన బీసీసీఐ ఉన్న‌ట్టుండి రిష‌బ్ పంత్(Rishabh Pant) ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు వెల్ల‌డించింది. త‌న‌కు గాయం కావ‌డంతో అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్ ను వికెట్ కీప‌ర్ గా చేస్తాడ‌ని టీం మేనేజ్ మెంట్ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ముగ్గురు క్రికెట‌ర్లు గాయం కార‌ణంగా వైదొలిగారు.

వారిలో ష‌మీ, బుమ్రా, పంత్ చేరి పోయారు. గాయం బెడిసి కొట్ట‌డంతో అత‌డిని ప‌క్క‌న పెట్టారు. ఢాకా వేదిక‌గా తొలి వ‌న్డే ప్రారంభ‌మైంది. బంగ్లాదేశ్ స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లో కుల్ దీప్ సేన్ ఆడుతున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌రల్డ్ క‌ప్ లో సెమీస్ లోనే భార‌త్ జ‌ట్టు ఘోరంగా ఓట‌మి పాలైంది. రిష‌బ్ పంత్ , కేఎల్ రాహుల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను ప‌క్క‌న పెట్టారు. కాగా శాంసన్ ను ఆడించ‌క పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

Also Read : ఐపీఎల్ మినీ వేలంపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!