Jay Shah Rishabh Pant : కోలుకుంటున్న రిషబ్ పంత్ – జే షా
ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి
Jay Shah Rishabh Pant : ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ కు వెళుతుండగా రూర్కీ సమీపంలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్వయంగా తానే కారును నడుపుకుంటూ వెళ్లాడు. ఇదిలా ఉండగా తను నిద్రలో ఉండి నడిపాడని అందుకే కారు డివైడర్ ను ఢీకొట్టిందని సమాచారం. తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ను స్థానిక రూర్క్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స చేసిన అనంతరం డెహ్రాడూన్ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు కోరారు. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జే షా(Jay Shah Rishabh Pant).
ప్రస్తుతం రిషబ్ పంత్ డేంజర్ జోన్ నుంచి బయట పడ్డాడని తెలిపారు. పంత్ కోలుకుంటున్నాడని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స ను వైద్యులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు.
ఇదిలా ఉండగా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కాగా రిషబ్ పంత్ కోలుకుంటున్నారని, వారి కుటుంబంతో కూడా తాను మాట్లాడానని తెలిపారు జే షా. నడుముకు గాయమైందని, ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాడని డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ వెల్లడించారు.
అంతకు ముందు రిషబ్ పంత్ ధోనీతో దుబాయ్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు.
Also Read : ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత