Rishabh Pant : సౌతాఫ్రికా టూర్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కు శాపంగా మారింది. ఇప్పటికే పేలమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఈ క్రికెటర్ పరిస్థితి దారుణంగా తయారైంది.
ఈనెల 11న సఫారీ టీమ్ తో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వికెట్ కీపర్ గా రాణించినా బ్యాటర్ గా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి.
సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 113 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించి బదులు తీర్చుకుంది.
ఇక మూడో టెస్టు నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ వెన్నుముక ప్రాబ్లం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు.
మరో వైపు గాయాలు టీమిండియాను వెంటాడుతున్నాయి. హైదరాబాదీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం రెండో టెస్టు సందర్భంగా గాయపడడంతో అతడి స్థానంలో ఇషాంత్ శర్మ ను తీసుకునే చాన్స్ ఉంది.
ఈ తరుణంలో రిషబ్ పంత్ (Rishabh Pant )పూర్ పర్ ఫార్మెన్స్ తో మూడో టెస్టులో అతడిని కాకుండా వృద్ధి మాన్ సాహాను ఆడించాలని యోచిస్తున్నట్లు టాక్.
ఈ మేరకు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ లు ఇద్దరూ సాహా వైపు చూస్తుండడంతో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ప్రస్తుత సీరీస్ లో నాలుగు ఇన్నింగ్స్ లు కలిపి పంత్ 59 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read : రిజ్వాన్..ఆజంకు అరుదైన పురస్కారం