Rishabh Pant : కోలుకుంటున్నా మైదానంలోకి వస్తా
ట్వీఈట్ చేసిన రిషబ్ పంత్
Rishabh Pant : భారత క్రికెటర్ రిషబ్ పంత్ కీలక ప్రకటన చేశారు. రూర్కీకి వెళుతూ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. బతికి బయట పడ్డాడు. రూర్కీకి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేయాల్సి రావడంతో ముంబైలోని కోకిలా బెన్ రిలయన్స్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరామర్శించారు. రిషబ్ పంత్ కు(Rishabh Pant) అవసరమయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్ర సర్కార్ ఏ సహాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
అవసరమైతే బీసీసీఐ లండన్ కు ఆపరేషన్ చేయించేందుకు సిద్దమేనని పేర్కొంది. అయితే వైద్యుల సూచనల మేరకు రిషబ్ పంత్ కు ముంబై లోనే ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అంతా సవ్యవగానే జరిగిందని స్వయంగా రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
ఈ సందర్భంగా తన గురించి ప్రార్థించిన ఫ్యాన్స్ , సహచరులు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపాడు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు రిషబ్ పంత్(Rishabh Pant). ఇదే క్రమంలో బీసీసీఐకి, కార్యదర్శి జే షాకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ఈసారి భారత్ లో జరిగే ఐపీఎల్ కు రిషబ్ పంత్ దూరం కానున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.
Also Read : 100 సెంచరీలు కోహ్లీకి సాధ్యం