Rishabh Pant : భారత క్రికెట్ జట్టులో భవిష్యత్తు కలిగిన ఏకైక క్రికెటర్ గా పేరొందాడు రిషబ్ పంత్. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు స్కిప్పర్ గా ఉన్నాడు. పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్(Rishabh Pant). ఉత్తరాఖండ్ లోని రూర్కీ లో 1997 అక్టోబర్ 4న పుట్టాడు.
ప్రస్తుతం అతడి వయసు 24 ఏళ్లు. ఎడమ చేతి బ్యాటర్. బౌలర్, వికెట్ కీపర్ కూడా. టీమిండియాలో కీలకంగా మారాడు. 2017లో క్రికెట్ లో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్ తో 2018 ఆగస్టు 18న టెస్ట్ ప్రారంభించాడు.
వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్ పై టీ20 మ్యాచ్ ఆడాడు. 2015 నుంచి ఐపీఎల్ (IPL) లో ఎంట్రీ ఇచ్చాడు. ఆనాటి నుంచి నేటి దాకా ఆ జట్టుకు ఆడుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు కెప్టెన్ గా ఉన్నాడు.
భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు అతడే కెప్టెన్ అవుతాడని క్రికెట్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా 2021లో జరిగిన ఐపీఎల్ (IPL) లో అనుకోని రీతిలో పంత్(Rishabh Pant) కు ఛాన్స్ దొరికింది నాయకుడిగా.
2016లో జరిగిన అండర్ -16 క్రికెట్ వరల్డ్ కప్ లో అండర్ -19 భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా పని చేశాడు. 2019లో ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషబ్ పంత్ ను బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) గా ఎంచుకుంది. 12 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి సోనెట్ క్రికెట్ అకాడమీలో చేరాడు.
ఇప్పటికే పరుగుల వరద పారించడంలో తనకు తనే సాటి. కెప్టెన్ గా వికెట్ కీపర్ గా ఆ జట్టుకు బలంగా ఉన్నాడు రిషబ్ పంత్. ఈ యువ కెరటానికి విపరీతమైన క్రేజ్ ఉంది యూత్ లో.
పలు కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నాడు. తన పేరుతో ఫ్యాషన బ్రాండ్ ను కూడా స్థాపించాడు. ఇక పంత్ నికర ఆదాయం రూ. 36 కోట్లు అని అంచనా.
Also Read : పవర్ ఉన్నోడు హార్దిక్ పాండ్యా