Rivaba Jadeja : గుజరాత్ ఎన్నికల్లో రివాబా జడేజా విక్టరీ
గుజరాత్ మోడల్ కు ప్రజలు పట్టం కట్టారు
Rivaba Jadeja : ప్రముఖ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆమె అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేశారు. గత కొంత కాలం నుంచి రివాబా జడేజా పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు.
ఎన్నికలు జరిగే కంటే ముందు క్రికెటర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజాతో(Rivaba Jadeja) కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇదే సమయంలో ఆయన భార్యకు టికెట్ కేటాయించింది బీజేపీ. ఇక అధికార పార్టీ టికెట్ పై నార్త్ జామ్ నగర్ నుంచి పోటీ చేశారు.
తన సమీప అభ్యర్థిపై రివాబా జడేజా 61,065 ఓట్ల భారీ తేడాతో విక్టరీ నమోదు చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసం కనబర్చారని కితాబు ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఇది తన విజయం కాదని ప్రజలందరి విజయమని స్పష్టం చేశారు రివాబా జడేజా. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని వారికి కూడా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు. తాను ఎన్నికల సందర్భంగా ఏమేం చెప్పానో వాటిని పార్టీ పరంగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రజలకు సేవలు అందజేస్తానని అన్నారు రివాబా జడేజా(Rivaba Jadeja). గుజరాత్ ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో అద్భుత విజయాన్ని కట్టబెట్టారని వారందరికీ థ్యాంక్స్ చెప్పారు.
Also Read : గుజరాత్ లో కమలం ప్రభంజనం