Riyan Parag Patel : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ , కోచ్ ప్రవీణ్ ఆమ్రే ప్రవర్తించిన తీరుపై ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది.
కోత విధించింది. ఒక మ్యాచ్ నుంచి నిషేధించింది ఆమ్రేను. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన బ్యాటర్ రియాన్ పరంగ్(Riyan Parag Patel ), ఆర్సీబీకి చెందిన బౌలర్ హర్షల్ పటేల్ మధ్య మాటల యుద్దం నడిచింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది. ఇందులో రియాన్ పరాగ్ ఒక్కడే అద్భుతంగా ఆడాడు.
31 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఫోర్లు సిక్సర్లు ఉన్నాయి. తన జట్టులో వికెట్లు కోల్పోతున్నా పరాగ్ మాత్రం ఒక్కడే బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇదిలా ఉండగా ఆఖరి ఓవర్ (20) ను హర్షల్ పటేల్ వేశాడు. ఇందులో పరాగ్ ఏకంగా 18 పరుగులు చేశాడు. కాగా హర్షల్ పటేల్ వేసిన ఆఖరి బంతికి రియాన్ పరాగ్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. పరాగ్ ఏదో అనడం పటేల్ ముందుకు రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ సిబ్బంది ఒకరు వచ్చి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దు మణిగింది.
Also Read : ఆడితే ఓకే లేదంటే వేటే – జయవర్దనే