Riyan Parag : పరాగ్ అద్భుతం ఫోర్లు..సిక్సర్ల వర్షం
12 ఫోర్లు 12 సిక్సర్లతో పరేషాన్
Riyan Parag : రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా ఆడాడు. ఈసారి జరిగిన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినా అంతగా ఆకట్టుకోలేక పోయాడు. కానీ దేశీవాలీలో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు.
అస్సాం, జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది.రియాన్ పరాగ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ దెబ్బకు ప్రత్యర్థి ఆటగాళ్లు బెంబేలెత్తి పోయారు. ఏకంగా 12 ఫోర్లు 12 సిక్సర్లతో దుమ్ము రేపాడు. కేవలం 116 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మొత్తం 174 పరుగులు చేశాడు.
ఫోర్ల ద్వారా 48 పరుగులు సాధిస్తే సిక్సర్ల ద్వారా 72 రన్స్ చేశాడు రియాన్ పరాగ్(Riyan Parag). తన అద్భుతమైన ఆట తీరుతో అస్సాం జట్టును సెమీ ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ పరంగా చూస్తే మొదట జమ్మూ కాశ్మీర్ నిర్ణీత ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి 350 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగింది అస్సాం టీమ్. ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే 351 రన్స్ ఛేదించి కోలుకోలేని షాక్ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ కు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది అస్సాం జట్టు. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ జట్టులో హెనాన్ నజీర్ 124 రన్స్ చేస్తే శుభమ్ ఖజారియా 120 పరుగులతో రెచ్చి పోయారు.
కానీ ఈ ఇద్దరిని మరిపించేలా అస్సాం ప్లేయర్లు రియాన్ పరాగ్ 174 రన్స్ చేసి సత్తా చాటితే రిషభ్ దాస్ 114 తో దుమ్ము రేపాడు. బౌలింగ్ లో కూడా సత్తా చాటడం విశేషం.
Also Read : రొనాల్డోకు సౌదీ ఫుట్ బాల్ క్లప్ బంపర్ ఆఫర్