Riyan Parag : ఐపీఎల్ 2022 రిచ్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. క్రికెట్ వర్గాల అంచనాలు అందకుండా జైత్రయాత్ర సాగిస్తోంది. రోజు రోజుకు ఒక్కో మ్యాచ్ లో ఒక్కోలా ఆడుతూ సమిష్టిగా ప్రయత్నం చేస్తోంది.
లీగ్ మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింద రాజస్థాన్. ఇక ఆర్సీబీ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఒకరి వెంట మరొకరు క్యూ కట్టారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.
దంచి కొడతాడని అనుకున్న హిట్ మైర్ , సూపర్ గా రాణిస్తాడని ఆశించిన జోస్ బట్లర్, సంజూ శాంసన్ తీవ్ర నిరాశ పరిచారు. ఈ సమయంలో ఒంటరి పోరాటం చేశాడు రియాన్ పరాగ్(Riyan Parag).
ఎక్కడా తొట్రు పాటుకు లోనుకాకుండా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ కేవలం 100 పరుగులన్నా దాటుతుందా అని పించింది. కానీ పరాగ్ చెలరేగాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 31 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రియాన్ పరాగ్ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అంతే కాదు మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఏకంగా 4 క్యాచ్ లు అందుకుని బెంగళూరు పతనాన్ని శాసించాడు. కళ్లు చెదిరేలా క్యాచ్ లు అందుకుని విస్తు పోయేలా చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
Also Read : ముస్తాక్ ను మరిచి పోలేనన్న బట్లర్