Mohammad Rizwan : టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రిజ్వాన్
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
Mohammad Rizwan : పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ డేషింగ్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
కేవలం 20 మ్యాచ్ లు ఆడిన రిజ్వాన్ 1326 పరుగులతో రాణించాడు.73.66 సగటుతో 13.489 స్ట్రైక్ రేట్ తో టాప్ లో నిలిచాడు. ఓపెనర్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా దుమ్ము రేపాడు.
2021లో అత్యధిక పరుగులు సాధించడమే కాదు పాకిస్తాన్ జట్టుకు కీలక విజయాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పాకిస్తాన్ జట్టును యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పోటీలో సెమీస్ కు చేరేందుకు దోహద పడ్డాడని ఐసీసీ పేర్కొంది.
టాప్ స్కోరర్ లలో మూడో ప్లేస్ లో నిలిచాడు మహ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan) . గత ఏడాది 2021 ప్రారంభంలో లాహోర్ లో దక్షిణాఫ్రికాపై తన కెరీర్ లో టీ20లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
కరాచీలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో సైతం మహ్మద్ రిజ్వాన్ ఇలాగే రాణించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరుకుంటోంది.
ఇక ఓమన్ కు చెందిన జీసన్ మక్సూద్ 2021 పురుషుల అసోసియేట్ ప్లేయర్ గా ఎంపికయ్యాడు. తన జట్టును ధీమాతో నడిపించడమే కాకుండా ఒమన్ తరపున బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కూడా కీలకంగా రాణించాడు.
మరో వైపు ఆస్ట్రియాకు చెందిన ఆండ్రియా మే జెపెడా 2021 ఉమెన్స్ అసోసియేట్ ప్లేయర్ గా ఎంపికైంది.
Also Read : కోహ్లీని కావాలనే తప్పించారు