RK Roja Selvamani : లోకేష్..పవన్..అచ్చెన్న అరెస్ట్ తప్పదు
ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ – ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచారు. తన ఆనందం వ్యక్తం చేశారు.
RK Roja Selvamani Shocking Comments
చంద్రబాబు నాయుడు చేసిన పాపం పండిందన్నారు రోజా. ఆయన జీవితాంతం చిప్ప కూడు తింటారని అన్నారు. ఆయనకు మద్దతు తెలిపిన అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం రోజులు లెక్క పెట్టు కోవాల్సిందేనని అన్నారు.
త్వరలోనే వాళ్లు కూడా అరెస్ట్ కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). చంద్రబాబు నాయుడు ఏమన్నా పైనుంచి ఊడి పడ్డాడా అని ప్రశ్నించారు. సామాన్యుడైనా , చంద్రబాబు అయినా చట్టం ముందు అంతా సమానమేనని పేర్కొన్నారు.
న్యాయం బతికే ఉందని నిరూపితమైందని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని అనుకున్నారని, ఏ ఒక్కరు బయటకు వచ్చి మద్దతు ప్రకటించిన పాపాన పోలేదన్నారు.
ఇన్నాళ్లు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చాడని కానీ ఇప్పుడు జగన్ రెడ్డి దెబ్బకు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : Nandamuri Balakrishna : బావ దమ్మున్నోడు తిరిగి వస్తాడు