RK Roja Selvamani : బాబును ఎవ‌రూ కాపాడ లేరు – రోజా

ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్

RK Roja Selvamani : విజ‌యవాడ – ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏం ముఖం పెట్టుకుని రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు వెళ్లావంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. ఎంత‌గా వేడుకున్నా, ప్రాధేయ ప‌డినా చంద్ర‌బాబు జైలు నుంచి రార‌ని జోష్యం చెప్పారు.

RK Roja Selvamani Comments Chandrababu

రాష్ట్ర అభివృద్ది గురించి, ప్ర‌జ‌ల ప్రయోజ‌నాల కోసం ఏనాడైనా నారా లోకేష్ రాష్ట్ర‌ప‌తిని క‌లిశావా అని ప్ర‌శ్నించారు రోజా. ప్ర‌జ‌ల సొమ్ము దోచుకుంటే చ‌ర్య‌లు తీసుకో వ‌ద్దంటే ఎలా అని నిల‌దీశారు రోజా(RK Roja Selvamani). ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి మోదీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాళ్లు ప‌ట్టుకునేందుకు తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.

అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు నాయుడును కాపాడేందుకు ఎవ‌రూ సిద్దంగా లేర‌న్నారు. అందుకే ప్ర‌ధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌లేద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. చంద్ర‌బాబు స్కిల్ స్కాంతో పాటు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రోడ్ , ఫైబ‌ర్ నెట్ వంటి అనేక స్కాంల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు.

రోడ్డు వేయ‌క ముందే అలైన్మెంట్ పేరుతో అడ్డంగా దోచుకున్నారు తండ్రీకొడుకులు అంటూ మండిప‌డ్డారు. ఆరు నెల‌ల్లో రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామంటే జ‌నం న‌వ్వుకుంటున్నార‌ని పేర్కొన్నారు ఆర్కే రోజా.

Also Read : Varudu Kalyani : భువ‌నేశ్వ‌రీ.. 20 వేల కోట్ల క‌థేంటి

Leave A Reply

Your Email Id will not be published!