Rishabh Pant : రోడ్డు ప్రమాదం ‘పంత్’ ఆటకు దూరం
కోలుకునేందుకు చాలా సమయం
Rishabh Pant : భారత క్రికెట్ జట్టులో జార్ఖండ్ డైనమెట్ గా పేరొందిన రిషబ్ పంత్ తన కెరీర్ కు తానే పుల్ స్టాప్ పెట్టేలా చేసుకున్నాడు. ఊహించని రీతిలో స్టార్ డమ్ , దాంతో పాటే వచ్చిన కోట్లు పంత్ ను ఒకచోట ఉండనీయలేదు. మెర్సిడెస్ కారును తానే నడుపుకుంటూ ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్లాడు.
రూర్కీ దగ్గరలో ప్రమాదానికి లోనయ్యాడు. భగవంతుడి ఆశీస్సులతో బతికి బయట పడ్డాడు. కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది. ఇదే సమయంలో హర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్టుకు చెందిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ , కండక్టర్ లు రిషబ్ పంత్ ను కాపాడారు. లేక పోతే కష్టమయ్యేది.
ప్రస్తుతం తీవ్ర గాయాలతో డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని, అతడిని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తామని డీసీడీఏ. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మోదీ పంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఏ సహాయం చేసేందుకైనా కేంద్ర సర్కార్ రెడీగా ఉందని భరోసా ఇచ్చారు.
ఇదే సమయంలో మొత్తం ఖర్చు తామే భరిస్తున్నట్లు ప్రకటించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఈ తరుణంలో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు రిషబ్ పంత్ కు(Rishabh Pant). ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో భారత్ లో జరిగే ఆసిస్ , శ్రీలంక, దక్షిణాఫ్రికా టూర్లకు దూరం కానున్నాడు.
ఇదే ఏడాది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కూడా ఆడాల్సి ఉంది రిషబ్ పంత్ . కానీ గాయం తీవ్రం కావడంతో జట్టుకు దూరం కానున్నాడు. గత కొంత కాలంగా పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఉన్నట్టుండి బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా టెస్టుల్లో రాణించాడు. కానీ ఉన్నట్టుండి ప్రమాదానికి గురయ్యాడు.
Also Read : కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్